- సినీ నటుడు రాజేంద్రప్రసాద్
చౌటుప్పల్ వెలుగు: పుణ్య లింగేశ్వర స్వామి దర్శనంతో జన్మ ధన్యమైందని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఆయన దర్శించారు.
ఆశ్రమ ఫౌండర్ గట్టు శంకర్, ఆలయ అర్చకులు రాజేంద్రప్రసాద్ కు ఘన స్వాగతం పలికారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను అమ్మానాన్న అనాధాశ్రమంలో ప్రతిష్టించడం గొప్ప విషయం అన్నారు. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వహించిన ఫౌండర్ గట్టు శంకర్ ను అభినందించారు.
