
- చర్చలు ఫలించకపోవడంతో ఆందోళన ఉధృతం
- ఫిల్మ్ ఫెడరేషన్ముందు పెద్ద ఎత్తున ధర్నా
- 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్
జూబ్లీహిల్స్, వెలుగు: చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న 24 విభాగాల వేతనాలు పెంచాలంటూ జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని ఫిల్మ్ ఫెడరేషన్కార్యాలయం ముందు సినీ కార్మికులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొద్ది రోజులుగా షూటింగ్స్‌కు వెళ్లకుండా ఎక్కడిక్కడ నిర్మాతలకు నిరసన సెగ తెలియజేస్తున్నారు.
శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆదివారం నుంచి ఆందోళన ఉధృతం చేశారు. వెంకటగిరిలోని ఫెడరేషన్ కార్యాలయం ముందు వందల సంఖ్యలో సినీ కార్మికులు చేరి 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ సినీ కార్మిల డిమాండ్లు నెరవేరే వరకు తాము షూటింగ్స్‌ను బంద్‌చేస్తామని ప్రకటించారు.