బిట్​ బ్యాంక్​: మొదటి సార్వత్రిక ఎన్నికలు

బిట్​ బ్యాంక్​: మొదటి సార్వత్రిక ఎన్నికలు
  •      హైదరాబాద్​ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952, ఫిబ్రవరిలో ముగిశాయి. 
  •     1952 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్​ రాష్ట్రం నుంచి పార్లమెంట్​కు 25 మంది సభ్యులు ఎన్నికయ్యారు. 
  •     1952 ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్​ శాసనసభకు 175 మంది సభ్యులు ఎన్నికయ్యారు.
  •     అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో గోసాయి – దేశాయి వర్గాలుగా పేరుపడ్డ కాంగ్రెస్​ వర్గాలు రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు వర్గాలు.
  •     1952 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్​ శాసనసభలో కాంగ్రెస్​ పార్టీ 93 స్థానాలు గెలుచుకుంది. 
  •     1952 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​ పేరుతో పోటీ చేశారు. 
  •     1952 సార్వత్రిక ఎన్నికల్లో పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులు హైదరాబాద్​ రాష్ట్ర శాసనసభలో 42 స్థానాలు గెలుచుకున్నారు. 
  •     1952 సార్వత్రిక ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. 
  •     1952 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్​ శాసనసభకు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్​ పార్టీ 46 స్థానాలు గెలుచుకుంది. 
  •     1952 ఎన్నికల్లో పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులు తెలంగాణలో 35 శాసనస సభ స్థానాలు గెలుచుకుంది. 
  •     1952 ఎన్నికల్లో ఓటమి పాలైన నిష్కల్మశప్రజా నాయకులు జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు. 
  •     హైదరాబాద్​ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు తర్వాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. 
  •     బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్​ రాష్ట్రానికి 1952 మార్చి 6 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 
  •     బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్​ రాష్ట్ర గవర్నర్​ సీఎం త్రివేది.
  •     హైదరాబాద్​ రాష్ట్ర శాసనసభ స్పీకర్​ కాశీనాథరావు వైద్య.
  •     హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్​ పంపన్​గౌడ్​.
  •     హైదరాబాద్​ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వి.డి.దేశ్​పాండే.
  •     బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో హోంశాఖ మంత్రి దిగంబరరావు బిందు. ​ 
  •     బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో కె.వి.రంగారెడ్డి ఎక్సైజ్​, అటవీ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 
  •     బూర్గుల రామకృష్ణారావు  మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి వినాయకరావు విద్యాలంకార్​. 
  •     బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మర్రి చెన్నారెడ్డి వ్యవసాయం, పౌర సరఫరాలు, ప్రణాళికా, అభివృద్ధి మంత్రిత్వశాఖలు నిర్వహించారు. 
  •     బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి గోపాలరావు ఎక్బొటే. 
  •     బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రి దేవీసింగ్​ చౌహన్​.
  •     బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ రాజ్​ప్రముఖ్​గా వ్యవహరించారు. 
  •     బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న ఐసీఎస్​ అధికారి ఎం.కె.వెల్లోడి. 
  •     హైదరాబాద్​ రాష్ట్రంలో రక్షిత కౌలుదార్ల చట్టం 1950 జనవరి నుంచి అమల్లో ఉంది. 
  •     భారతదేశంలో భూకమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పేరుపొందారు. 
  •     బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం కరెన్సీ, నాణేలు రద్దయి, వాటి స్థానంలో భారత ప్రామాణిక కరెన్సీ అమల్లోకి తీసుకువచ్చారు. 
  •     మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం హైదరాబాద్​. 
  •     మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. 
  •     ప్రతి 500 జనాభా గల గ్రామానికి పాఠశాలను ఏర్పాటు చేసింది బూర్గుల రామకృష్ణారావు. 
  •     బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో మొదటి తరగతి నుంచి మాతృభాషలో విద్యా బోధన ప్రవేశపెట్టారు. 
  •     బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో ఐదో తరగతి నుంచి ఇంగ్లీష్​ భాషను ప్రవేశపెట్టారు. 
  •     వరంగల్​ జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి 1953 అక్టోబర్​ 1న ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. 
  •     హైదరాబాద్​ రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖను 1955 జులై 1న ఏర్పాటు చేశారు. 
  •     నాగార్జున సాగర్​ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శంకుస్థాపన చేసింది 1955 డిసెంబర్ 10న.
  •     తెలంగాణలో భూదానోద్యమం 1951 ఏప్రిల్​ 18న నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి నుంచి ప్రారంభమైంది.