వార్ధా, ప్రాణహిత నదులు ఫుల్

వార్ధా, ప్రాణహిత నదులు ఫుల్

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వార్ధా, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం నాటికి మరింత పెరిగింది. సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్ సమీపంలో వార్ధా నదిపై ఉన్న అంతర్రాష్ట్ర హై లెవెల్ బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. కౌటాల మండలం తుమిడిహెట్టి వద్ద ప్రాణహిత నదికి మళ్లీ వరద పెరగడంతో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి.

చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద 5లక్షల 89వేల  క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నదీ తీరంలో ఉన్న  వందల ఎకరాల్లో పంట నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.