
న్యూఢిల్లీ: పాలసీ హోల్డర్లకు రూ. 2,180 కోట్లను బోనస్‌గా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ చూస్తోంది. పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొన్న పాలసీహోల్డర్లకు ఈ బోనస్‌లు అందుతాయి. డివిడెండ్ అమౌంట్‌ను పొందడానికి వీలుండే పాలసీలను పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పాలసీలంటారు. ఇటువంటి పాలసీలను కొన్న వారికి కంపెనీ తన లాభాల్లో కొంత అమౌంట్‌ను బోనస్‌గా ఇస్తుంది. అర్హులైన పాలసీహోల్డర్లకు పార్టిసిపేటింగ్ ఫండ్‌లో క్రియేట్ అవుతున్న మిగులు అమౌంట్‌లో కొంత వాటా దక్కుతుందని, బోనస్ ద్వారా వారికి వచ్చే బెనిఫిట్ అమౌంట్ ప్రతీ ఏడాది పెరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కిందటేడాది ఇచ్చిన అమౌంట్ కంటే 44 శాతం ఎక్కువ అమౌంట్‌ను బోనస్ కింద కంపెనీ కేటాయించింది. అర్హులైన 15.49 లక్షల మంది పాలసీ హోల్డర్లను గుర్తించామని పేర్కొంది.