తిరుపతి ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిక్కిన చిరుత

తిరుపతి ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిక్కిన చిరుత

తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ ఆవరణలో సంచరిస్తున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వర్సిటీలో సంచరించిన చిరుత ఇప్పటికీ ఇదే ప్రాంతంలో తిరుగుతున్నట్లు  సీసీ ఫుటేజ్ లో బయటపడింది. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ముందు జాగ్రత్తగా ప్రజలకు హెచ్చరికలు చేస్తూ.. బోర్డులు ఏర్పాటు చేశారు. చీకటి పడిన తర్వాత.. తెల్లారే వరకు ఎవరూ తిరగొద్దని హెచ్చరికలు చేశారు. చిరుత సంచరించిన ప్రాంతాలను గుర్తించి దాన్ని బంధించేందుకు రెండు చోట్ల ట్రాప్ ఏర్పాటు చేశారు. 

నిన్న రాత్రి నుంచి చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు తెల్లారాక ఫలించాయి. దాన్ని పట్టేందుకు ఏర్పాటు చేసిన ఒక బోనులో చిరుత చిక్కింది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుత పులిని  అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు.