ఖిలా గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చండి : చల్లా సుధీర్ రెడ్డి

 ఖిలా గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చండి : చల్లా సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు: స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండలో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఖిలా గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి శుక్రవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని కోరారు. 

ఈ సందర్భంగా ఆయన మంత్రికి ఖిలాగుట్ట విశిష్టతను తెలుపుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి, తాటికొండ మాజీ సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి, చల్లా ఇంద్రజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.