వీడీసీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

వీడీసీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ దయ్యాల మార్కెట్ నుంచి సాగర్ లాల్ హాస్పిటల్ వరకు రూ.1.60 కోట్లతో  వీడీసీసీ రోడ్డు పనులకు ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నగరంలో సీసీరోడ్లు, నాలాల అభివృద్ధి అవసరం ఉన్నచోట పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వర్షం నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 

కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పోటాపోటీగా నినాదాలు చేశారు. ముఖ్య నాయకులు వారించినా వారు వినిపించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.