సెప్టెంబర్ 10 వరకు స్విగ్గీ, జొమాటో సేవలు బంద్

సెప్టెంబర్ 10 వరకు స్విగ్గీ, జొమాటో సేవలు బంద్

జీ–20 సమిట్​కు ఢిల్లీ సిద్ధమవుతోంది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమిట్​కు అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో ఈ సమిట్ జరగనుంది. 

ఈ నెల 8, 9,10వ తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌‌ డెలివరీ సేవలు రద్దు చేశారు. బ్లింకిట్‌‌, జెప్టో.. ఈ– కామర్స్‌‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌, మింత్రా వంటి సంస్థల డెలివరీలకూ అనుమతి లేదు. ఈ ఆంక్షలు 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ దాకా అమల్లో ఉంటాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. మెడిసిన్‌‌ వంటి వస్తువులు డెలివరీ చేయొచ్చు. వైద్య, పోస్టల్‌‌ సేవలు అనుమతిస్తారు. మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు. 8న (శుక్రవారం) ఐటీ ఉద్యోగులకు వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోం అమలు చేయాలని కంపెనీలకు ఢిల్లీ ప్రభుత్వం కోరింది.