
వెలుగు నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల ప్రభుత్వ ఆస్పత్రిల్లో పండ్లు పంపిణీ చేయగా, మండల కేంద్రాల్లో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కాకా జీవితం ప్రజలకు అంకితం చేశారని తెలిపారు.
బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కాకా ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో పెద్దపల్లిలో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు.
సుల్తానాబాద్ పట్టణంలో వెంకటస్వామి విగ్రహానికి ఎమ్మెల్యే విజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి అన్నదానం చేశారు. గోదావరిఖనిలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ హాజరై కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి, గోదావరిఖని,సుల్తానాబాద్, రామగుండం, మంథని, ముత్తారం, జూలపల్లి, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లో అభిమానులు అన్నదానాలు చేశారు.
సుల్తానాబాద్ ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో నీరటి శంకర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ శ్రీహర్ష పాల్గొని కాకా ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. మంథని కేంద్రంగా కాకా విగ్రహానికి మాలమహానాడు ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. మంథని ఆర్డీవో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆయా కార్యక్రమాల్లో జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్ కమిషనర్ టి.రమేశ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్సజ్జద్, మల్లికార్జున్, ఉనుకొండ శ్రీధర్ పటేల్, గాజుల రాజమల్లు, బండారి సునీల్, గంగుల సంతోష్, సాయిరి మహేందర్, అబ్బయ్యగౌడ్, బిరుదు కృష్ణ, నీరటి శంకర్, ధరడే శ్యామ్, కల్వల శ్రీనివాస్, అడ్డగుంట శ్రీనివాస్, విజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వెంకటస్వామి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. జమ్మికుంటలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో కాకా జయంతిని ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్, ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు బలిజ రాజారెడ్డి ఆధ్వర్యంలో కోరుట్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాకా ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
కరీంనగర్ డీసీసీ ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో కాకా ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజ మల్లయ్య, డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, డీసీసీ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, నాయకులు పాల్గొన్నారు.