15 ఏండ్ల సర్వీస్ దాటిన ప్రభుత్వ వాహనాలన్నీ స్క్రాప్​లోకే: గడ్కరీ

15 ఏండ్ల సర్వీస్  దాటిన ప్రభుత్వ వాహనాలన్నీ స్క్రాప్​లోకే: గడ్కరీ

ముంబై: దేశంలో15 ఏళ్ల సర్వీస్ దాటిన ప్రభుత్వ వాహనాలను రద్దు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆ వెహికల్స్ అన్నింటిని స్క్రాప్‌‌‌‌గా మారుస్తామని.. అందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే రాష్ట్రాలకు పంపామని తెలిపారు. శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్-పూర్-లో 'ఆగ్రో–-విజన్' వ్యవసాయ ఎగ్జిబిషన్‌‌‌‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. 

రోడ్లపై తిరిగే 15 ఏళ్ల నాటి ప్రభుత్వ వాహనాలను స్క్రాప్  చేయాలని రాష్ట్రాలకు సూచించినట్లు గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్‌‌‌‌పై సంతకంకూడా చేశానని చెప్పారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.