ఏసీ రూంలో మష్రూమ్స్​..లాభాల పంట

ఏసీ రూంలో మష్రూమ్స్​..లాభాల పంట

‘పెట్టుబడి పోగా ఎంతోకొంత మిగిలితే చాలు’ అనుకుంటారు  రైతులు. కానీ, బీహార్​లోని గయకి చెందిన రాజేష్​సింగ్​ అలా అనుకోలేదు. తనతో పాటు మరో నలుగురు రైతులు బాగుపడాలి అనుకున్నాడు. రైతులకి రెగ్యులర్​ ఆదాయం ఉండాలి అనే ఆలోచనతో​ మష్రూమ్​ కల్టివేషన్​ మొదలుపెట్టాడు​. 
గోధుమ గడ్డి, ఏసీ వాతావరణంలో మష్రూమ్​ యూనిట్​ ఏర్పాటు చేసి లాభాల బాటలో సాగుతున్నాడు. 

మష్రూమ్స్​.. తడి ఉన్నచోట గుట్టలు గుట్టలుగా పెరుగుతాయి. ఇంటి దగ్గర మష్రూమ్స్​ పెంచడమంటే కొంత కష్టమే. అలాంటిది కొత్తపద్ధతిలో పుట్టగొడుగుల్ని పెంచి చూపిస్తున్నాడు రాజేష్​. పెద్ద పెద్ద పాలిథీన్​ సంచుల్లో గోధుమ పొట్టు కలిపిన కంపోస్ట్​ నింపి, వాటిలో మష్రూమ్స్ పెంచుతున్నాడు.  ‘‘రైతులకి రెగ్యులర్​ ఆదాయం ఉండాలని ఈ యూనిట్​ మొదలుపెట్టాను. గోధుమగడ్డి, కంపోస్ట్​తో తక్కువ ఖర్చులోనే పుట్టగొడుగుల్ని పెంచుతున్నా. మష్రూమ్స్ ‘వింటర్​ వెజిటబుల్’ కాబట్టి  యూనిట్​లో ఉష్ణోగ్రత​ 16 డిగ్రీలు ఉంచడం కోసం ఏసీలు ఏర్పాటు చేశా. మేం పండించే మష్రూమ్స్​కు డిమాండ్​ బాగా ఉంది. ఒక్కోసారి పండించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి”అని చెప్పాడు రాజేష్​. 

రోజుకు 300 కిలోలు

‘‘నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. పదిహేనేళ్లు జాబ్​ చేసినంక నాకు  వ్యవసాయం చేయాలనిపించింది. నలుగురికి ఉపాధి కల్పించడంతో పాటు నాకు, నా ఫ్యామిలీకి రెగ్యులర్​గా డబ్బు వచ్చే మార్గం గురించి ఆలోచించాను. ఇన్​డోర్​ మష్రూమ్ కల్టివేషన్​ని2016లో మొదలుపెట్టాను. ఇప్పుడు మా యూనిట్​లో రోజుకి 200 నుంచి 300 కిలోల మష్రూమ్స్ కోతకి వస్తాయి. వాటిని ప్యాక్​ చేసి అమ్ముతున్నాం” అంటున్న రాజేష్​ని చాలామంది రైతులు ఫాలో అవుతున్నారు.