V6 News

థాయ్ లాండ్ పారిపోయిన గోవా నైట్ క్లబ్ ఓనర్లు లుత్రా బ్రదర్స్..

థాయ్ లాండ్ పారిపోయిన గోవా నైట్ క్లబ్ ఓనర్లు లుత్రా బ్రదర్స్..

కొద్దిరోజుల క్రితం గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన పెద్ద అగ్నిప్రమాదంలో 25 మంది చనిపోయిన సంగతి మీకు తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్ ఓనర్లు సౌరవ్ లూత్రా, గౌరవ్ లూత్రా అనే ఇద్దరు అన్నదమ్ములపై త్వరలో అంతర్జాతీయంగా వెతికే బ్లూ కార్నర్ నోటీసును జారీ కానుంది. 

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు అన్నదమ్ములు దేశం వదిలి పారిపోయారు. దింతో వారిని పట్టుకోవడానికి గోవా పోలీసులు ఇంటర్‌పోల్ అనే అంతర్జాతీయ పోలీసు సంస్థ సహాయం తీసుకోబోతున్నారు.

థాయిలాండ్‌కు పారిపోయిన అన్నదమ్ములు :
పోలీసుల ప్రకారం, లూత్రా సోదరులు డిసెంబర్ 7న ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానంలో ఫుకెట్ (థాయిలాండ్) పారిపోయారు. ఈ నైట్‌క్లబ్ ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్లబ్ సిబ్బందే ఉండగా, ఐదుగురు పర్యాటకులు కూడా ఉన్నారు.

యజమానులపై లుక్అవుట్ నోటీసు: 
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే వారిపై దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. ఢిల్లీలోని వీరి ఇంటికి కూడా తాళం వేసి ఉండగా.. వీరి బిజినెస్ పార్ట్నర్ అయిన అజయ్ గుప్తా కోసం పోలీసులు  వెతుకుతున్నారు. ఈ కేసులో భరత్ కోహ్లీ, రాజీవ్ మోదక్, వివేక్ సింగ్, రాజీవ్ సింఘానియా, రియాన్షు ఠాకూర్ సహా కొంతమందిని  పోలీసులు అరెస్టు చేశారు. 

Also Read  :ఇండిగో నెత్తిన పెద్ద బండ.. 5 శాతం రూట్లను కోల్పోక తప్పని పరిస్థితి
 
అయితే ఈ అగ్నిప్రమాదానికి బాణసంచా (ఫైర్‌క్రాకర్స్) కారణమై ఉండవచ్చు అని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా ప్రాథమిక దర్యాప్తులో క్లబ్‌లో ఫైర్ డిపార్ట్‌మెంట్ నుండి అనుమతి (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేదని, సరైన పత్రాలు లేకుండానే లైసెన్స్ ఇచ్చారని తేలింది. ఈ ఘటనపై విచారణకు ఉత్తర గోవా కలెక్టర్ అంకిత్ యాదవ్ అధ్యక్షతన ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.