
మలయాళీ ముద్దుగుమ్మ హనీరోజ్(Honey Rose) యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఆమెను దాదాపు 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. తెలుగులో ‘వీరసింహా రెడ్డి’ సినిమాతో హనీ క్రేజ్ మరోస్థాయికి చేరింది.
అయితే ఆమె భారీ అందాలకు కారణం సర్జరీలే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై తాజాగా ఈ హీరోయిన్ స్పందించింది. ‘గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నందుకు అందంగా కనిపించడం ఎంతో ముఖ్యం. అందుకోసం నేను సర్జరీలు చేయించుకున్నాననే వార్తల్లో నిజం లేదు.
మన దేహం దేవుడి సృష్టిలో భాగం. దాని కోసం కృత్రిమ మార్గాలను ఎంచుకోలేదు. నటిగా కొనసాగడం తేలికైన విషయం కాదు. గ్లామర్‌గా కనిపించేందుకు అందరు అమ్మాయిల్లాగానే కొన్ని రకాలు సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటాను’ అని హనీ క్లారిటీ ఇచ్చింది.