గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 86 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 86 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పాల్వంచలోని గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో 85పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కాలేజీ ప్రిన్సిపాల్​ బుధవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్​–6, అసోసియేట్​ ప్రొఫెసర్​–34, అసిస్టెంట్​ ప్రొఫెసర్​–18, సీనియర్​ రెసిడెంట్స్​ –22తో పాటు ఆరు ట్యూటర్​ పోస్టులను కాంట్రాక్ట్​ పద్ధతిన నియమించనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల  అభ్యర్థులు  దరఖాస్తులను తీసుకొని ఈ నెల 27న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మెడికల్​ కాలేజీలో నిర్వహించనున్న వాక్​ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

ప్రొఫెసర్​కు రూ. 1.90లక్షలు, అసోసియేట్​ ప్రొఫెసర్​కు రూ. 1.50లక్షలు, అసిస్టెంట్​ ప్రొఫెసర్​కు రూ. 1.25లక్షలు, సీనియర్​ రెసిడెంట్​కు రూ. 1,06,461, ట్యూటర్​కు రూ. 55వేలు వేతనం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు కాలేజ్​ వెబ్​ సైట్​లో చూడాలని సూచించారు.