
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రామచంద్రాపురం, వెలుగు : దేశంలో రైతులు, కార్మికుల సాధికారిత కోసం సర్దారల్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైతు ఉద్యమాల కోసం ఆయన చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదని అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో రెండు రోజులు పాటు నిర్వహించనున్న ‘సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు – చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు’ అనే నేషనల్ సెమినార్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ల్ సెమినార్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ కృషి వల్లే గ్రామీణ భారతం జాతికి ఆత్మగా మిగిలిపోయిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ అద్భుతమైన పాత్ర పోషించారని చెప్పారు. ఇలాంటి సెమినార్లు విలువైన చర్చలకు దారి తీస్తాయన్నారు. అంతకు ముందు గీతం క్యాంపస్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ ఇండెక్స్ సీఈడీ, ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ జోషి, గీతం వీసీ ప్రొఫెసర్ డీఎస్.రావు పాల్గొన్నారు.