కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌ రద్దు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌ రద్దు

నకిలీ, నాణిత్య లేని  మందులను ఉత్పత్తి చేస్తున్న  18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను మార్చి 28న  కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కంపెనీల తయారీని నిలిపివేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 76 కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) తనిఖీలు చేపట్టింది. నకిలీ, నాణిత్య లేని  మందులను తయారు చేస్తున్నట్లు తేలిన 18 సంస్థలపై చర్యలు తీసుకుంది.

అయితే వీటిలో కొన్నింటి   లైసెన్స్‌లను రద్దు చేయగా, మరి కొన్నింటి   లైసెన్స్‌లను సస్పెండ్ చేసింది. మరో 26 కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో 70, ఉత్తరాఖండ్‌లో 45, మధ్యప్రదేశ్‌లో 23 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లుగా తెలిపింది.

ఇటీవల, భారతదేశానికి చెందిన కంపెనీలు తయారు చేసే ఔషధాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో డిసిజిఐ చర్యలు చేపట్టింది.   గత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది పిల్లల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.