
అక్టోబర్ 2027 నుండి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకి అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్స్ (AVAS) అమర్చాలని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆదేశంతో ఎలక్ట్రిక్ వాహనాల నిశ్యబ్ధంకి సంబంధించిన భద్రతా సమస్యలకి ప్రభుత్వం చెక్ పెట్టనుంది.
నిబంధనల ప్రకారం, కొత్తగా తయారు చేసిన అన్ని ఎలక్ట్రిక్ ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు అక్టోబర్ 2026 నాటికి AVAS టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయాలి. అలాగే అక్టోబర్ 2027 నుండి ఉత్పత్తి చేసే అన్ని ఎలట్రిక్ వాహనాలు కూడా ఈ భద్రతా సిస్టంతో ఉండాలి.
ఎలట్రిక్ వాహనాలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నప్పుడు AVAS ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. పాదచారులు, సైక్లిస్టులు, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు దగ్గరలో ఉన్న ఎలట్రిక్ వాహనాల గురించి అప్రమత్తం చేయడానికి కృత్రిమ శబ్దాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ సాంకేతికత ఎలక్ట్రిక్ & హైబ్రిడ్ వాహనాలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఇంజిన్ సౌండ్ తక్కువగా ఉన్న పరిస్థితులలో.
అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు AVAS అవసరం ఉండదు, ఎందుకంటే టైర్ల ఘర్షణ వల్ల దగ్గరలో ఉన్న రోడ్డు వినియోగదారులకు సౌండ్ వినిపించే అంత శబ్దం వస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్యూబ్‌లెస్ టైర్లతో నడిచే వాహనాలు, కార్లు, త్రీ-వీలర్లు, క్వాడ్రిసైకిళ్లలో స్పేర్ టైర్ తప్పనిసరి రూల్ తొలగించే చర్యలు కూడా ఈ ప్రకటనలో ఉన్నాయి.