- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో విషాదం
అశ్వారావుపేట, వెలుగు : ఈతకు వెళ్లి ఓ బాలుడు చనిపోగా.. ఆతని మరణాన్ని తట్టుకోలేక హార్ట్‌ఎటాక్‌తో నానమ్మ మరణించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంటలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దొంతికుంటకు చెందిన గుమ్మళ్ల విజయ్ కుమారుడు యశ్వంత్ (16) స్థానిక సర్కార్ స్కూల్‌లో టెన్త్ చదువుతున్నాడు.
ఆదివారం ఫ్రెండ్స్‌తో కలిసి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జీనుగుమిల్లి మండలం సంగం వాగులో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో యశ్వంత్ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని యశ్వంత్ డెడ్‌బాడీని అశ్వారావుపేటకు తీసుకొచ్చారు. మనవడి మృతదేహాన్ని చూసిన అతడి నాయనమ్మ గుమ్మళ్ల వెంకమ్మ (60) రోదిస్తూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. మనవడు, నాయనమ్మ ఒకే రోజు చనిపోవడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.
