కర్నాటకలో వైభవంగా భద్రాద్రి రాములోరి కల్యాణం

కర్నాటకలో వైభవంగా  భద్రాద్రి రాములోరి కల్యాణం

భద్రాచలం, వెలుగు: కర్నాటకలోని తుమకూరులో ఆదివారం భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామరథం ద్వారా గ్రామంలోకి సీతారాములను రామభక్తులు శోభాయాత్రగా తీసుకెళ్లారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులు కల్యాణ కట్నాలు, కన్యాదానం, అన్నదానం, గోశాల, యూపీఐ ద్వారా రూ.42వేలను శ్రీసీతారామచంద్రస్వామికి కానుకలుగా సమర్పించారు.