వామ్మో ఇంతపెద్ద పామా? నెట్‎లో వైరల్

వామ్మో ఇంతపెద్ద పామా? నెట్‎లో వైరల్

జేసీబీతో పామును పైకెత్తిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఆ వీడియోలో పాము భారీ సైజును చూసి నెటిజన్లంతా ఔరా అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాము జార్ఖండ్‌ ధన్‌బాద్‌లోని ఎఫ్‌సిఐ సింద్రీలో బయటపడిందని వార్తలొచ్చాయి. 

వంద కిలోల బరువు, 6.1 మీటర్ల పొడవున్న ఈ పాము జార్ఖండ్‌ ధన్‌బాద్‌లో కనిపించింది. ఈ పామును పైకి లేపడానికి క్రేన్ అవసరం తీసుకోవాల్సి వచ్చింది అని రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాథవానీ తన ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఇటువంటి పాము జార్ఖండ్‌లో కనిపించలేదని అక్కడి అధికారులు ధృవీకరించారు. ఈ పాము డొమినికా అడవిలో బయటపడినట్లు టిక్ టాక్‎లో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో టిక్ టాక్‎లో 79 మిలియన్లకు పైగా వీక్షించబడి వైరల్‎గా మారింది. 

For More News..

పంపకాల పంచాయతీ వల్లే హుజురాబాద్ ఉపఎన్నిక

మేం గెలిస్తే.. కాలేజ్ అమ్మాయిలకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు

సిటీ బస్సు ఎక్కిన సీఎం