పరమాత్ముడి సేవలో ఉన్న తృప్తి దేనిలో ఉండదు : ఎమ్మెల్యే హరీశ్ రావు

పరమాత్ముడి సేవలో ఉన్న తృప్తి దేనిలో ఉండదు :  ఎమ్మెల్యే హరీశ్ రావు
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: పరమాత్ముడి సేవలో ఉన్న తృప్తి దేనిలో ఉండదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో సత్సంగంలో, రూరల్ మండలం ఇర్కోడు గ్రామ పరిధిలోని శ్రీ కృష్ణాలయంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖం ఉండదన్నారు. అనంతరం చిన్నకోడూరు మండలం చెర్ల ​అంకిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న నవగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. 35 వార్డు కౌన్సిలర్ భూంపల్లి శ్రీలత మామ చనిపోగా ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

అనంతరం జాతీయ యోగా పోటీలకు రాష్ట్రం నుంచి ఎంపికైన సిద్దిపేట యోగా సాధకులను సన్మానించి అభినందించారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించి సిద్దిపేట ఖ్యాతిని చాటాలని సూచించారు. కార్యక్రమంలో యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సతీశ్, స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ సాయిరాం పాల్గొన్నారు.