యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీక మాసం చివరి వారానికి తోడు ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. నారసింహుడి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది 1,953 మంది దంపతులు వ్రతాలు చేశారు. ఒక్కరోజే వ్రతాల ద్వారా రూ.19.53 లక్షలు, పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.54.94 లక్షల ఆదాయం సమకూరింది.
