
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం పలుచోట్ల ప్రారంభమైన వాన రాత్రి పొద్దుపోయేదాకా కురిసింది. ఆత్మకూరు(ఎం)లో అత్యధికంగా 11.4 సెం.మీ కురవగా మోత్కూరులో 8.4 సెం.మీ కురిసింది. బొమ్మల రామారం, గుండాలలోనూ భారీ వర్షం కురిసింది.