కూలిన ఐరన్ కమాన్

 కూలిన ఐరన్ కమాన్

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంబజార్ జగ్జీవన్ రామ్ బస్తీలో వరద నీరు చేరి, ఐరన్ కమాన్ కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దూద్‌ఖానా, ఉస్మాన్‌గంజ్ ప్రాంతాలు బురదమయం అయ్యాయి. గురుద్వారా వద్ద బైక్‌లు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టారు. హైడ్రా సిబ్బంది తెల్లవారుజాము వరకు వరద నీటిని, చెత్తను తొలగించే పనులు చేపట్టారు.‌‌ ‌‌- వెలుగు, ఎల్బీనగర్