Allari Naresh: హీరో అల్లరి నరేశ్‌ ఫ్యామిలిలో తీవ్ర విషాదం..

Allari Naresh: హీరో అల్లరి నరేశ్‌ ఫ్యామిలిలో తీవ్ర విషాదం..

టాలీవుడ్ హీరో ‘అల్లరి’ నరేశ్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తాతయ్య, దివంగత ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) మంగళవారం (జనవరి 20, 2026) తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

వెంకట్రావు సతీమణి వెంకటరత్నం 2019లోనే మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివంగత ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో పరమపదించారు. రెండో కుమారుడు ఇ.వి.వి. గిరి, మూడో కుమారుడు ఇ.వి.వి. శ్రీనివాస్ కాగా, కుమార్తె ముళ్లపూడి మంగాయమ్మ.

టాలీవుడ్ నటులు అల్లరి నరేశ్‌, ఆర్యన్ రాజేష్‌లకు వెంకట్రావు స్వయానా తాతగారు. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో అల్లరి నరేశ్‌ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

►ALSO READ | Akshay Kumar: హీరో అక్షయ్ కుమార్ భద్రతా వాహనం బోల్తా.. త్రుటిలో బయటపడిన దంపతులు!

ఆయన అంత్యక్రియలు ఇవాళ  సాయంత్రం 4 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో జరగనున్నాయి. వెంకట్రావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.