
‘దసరా’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకున్న నాని.. ఈసారి ఓ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టై నర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. నాని కూతురుగా బేబీ కియా రా ఖన్నా కనిపించనుంది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ కూనూర్‌లో ప్రారంభమైందని తెలియజేశారు మేకర్స్. అలాగే ఈ మూవీ మ్యూజికల్ ఫెస్ట్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.