డిప్లొమాలు ఇంటర్మీడియెట్‌‌‌‌కు సమానమే : హైకోర్టు

డిప్లొమాలు ఇంటర్మీడియెట్‌‌‌‌కు సమానమే : హైకోర్టు
  • వారికీ డీఈఈ కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: డిప్లొమాలు ఇంటర్మీడియెట్‌‌‌‌కు సమానమని..వారికి డీఈఈ (డిప్లమో ఇన్‌‌‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమో ఇన్‌‌‌‌ ప్రిస్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌) కోర్సుల అడ్మిషన్లను నిరాకరించడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. తాను ఇంటర్ బదులు ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌ డిప్లొమా చేసినందుకు డీఈఈ కోర్సులో ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌‌‌‌ కాలనీకి చెందిన కంపెల హరీశ్‌‌‌‌ కోర్టును ఆశ్రయించాడు.

అతని పిటిషన్ ను జస్టిస్‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌ విచారణ జరిపారు. పిటిషనర్ వాదిస్తూ.. డీఈఈ కోర్సు ఎంట్రన్‌‌‌‌లో ర్యాంక్‌‌‌‌ సాధించినా ఇంటర్ పూర్తి చేయలేదనే కారణంతో అడ్మిషన్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దీనిౖపై ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్‌‌‌‌  డీఈఈ కోర్సు అయ్యాక సెకండరీ గ్రేడ్‌‌‌‌ టీచర్‌‌‌‌ పోస్టుకు ఎంపికైతే తెలుగు, ఇంగ్లిషు భాషలు వచ్చి ఉండాలని.. ఈ రెండు భాషలు డిప్లొమాలో ఉండవు కాబట్టి అడ్మిషన్‌‌‌‌కు అర్హుడు కాదన్నారు.