రెండో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు... కొత్వాల్గూడ నుంచి చిట్యాలకు..

రెండో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు... కొత్వాల్గూడ నుంచి చిట్యాలకు..
  • అలైన్​మెంట్​ ఖరారు చేసిన హెచ్ఎండీఏ 
  • 300 మీటర్ల వెడల్పు..51.4 కిలోమీటర్లు  
  • కొద్ది రోజుల కిందటే 
  • భూసేకరణకు నోటిఫికేషన్​  
  • త్వరలో పనులకు శ్రీకారం

హైదరాబాద్​సిటీ, వెలుగు : ఔటర్​రింగ్​రోడ్ నుంచి రాబోయే ట్రిపుల్​ఆర్​కు కనెక్టివిటీ కోసం ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గ్రీన్​ఫీల్డ్​రేడియల్​రోడ్​–2 పనులకు హెచ్ఎండీఏ అలైన్​మెంట్​ను ఖరారు చేసింది. త్వరలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్​అండ్​ట్రిపుల్​ఆర్​మధ్యలోని పెరిపెరల్​అర్బన్​రీజియన్​(పీయూఆర్)ను అభివృద్ధి చేయడం ద్వారా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ రేడియల్​రోడ్లను నిర్మించనున్నది. ఇప్పటికే గ్రీన్​ఫీల్డ్​రేడియల్​రోడ్​–1 పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఓఆర్ఆర్​రావిర్యాల ఎగ్జిట్​పాయింట్13  నుంచి ఫ్యూచర్​సిటీ మీదుగా కొంగర కుర్ధు నుంచి కొంగర కలాన్​, అక్కడి నుంచి మీర్​ఖాన్​పేట, ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్​, ముద్విన్​, ఆమన్​గల్​ మీదుగా ఆకుతోట పల్లి వరకూ ట్రిపుల్​ఆర్​ను కలుపుతూ  18 కి.మీ. రోడ్డును నిర్మిస్తున్నారు. 

 6 మండలాలు..26 గ్రామాలను కలుపుతూ..

గ్రీన్​ఫీల్డ్​రేడియల్​రోడ్​-2ను ఓఆర్​ఆర్​కొత్వాల్​గూడ నుంచి పరిగిలోని చిట్యాల వరకూ ట్రిపుల్​ఆర్​ను అనుసంధానం చేస్తూ  51.4 కి.మీ. రోడ్డు నిర్మించనున్నారు. ఈ రోడ్డు కూడా 300 మీటర్ల వెడల్పుతో వేయనున్నారు. దీని అలైన్​మెంట్​కు ప్రభుత్వ అనుమతి కూడా అభించింది.

 దీని కోసం రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాల్లోని ఆరు మండలాల్లో ఉన్న 26 గ్రామాల్లో అధికారులు  భూసేకరణ చేయనున్నారు. కొత్వాల్​గూడలో ఓఆర్ఆర్​కు గ్రీన్​ఫీల్డ్​రోడ్ లింక్​చేయడానికి జంక్షన్​ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఓఆర్ఆర్​నుంచి ట్రిపుల్​ఆర్​మధ్య ఉన్న పెరి అర్బన్​ రీజియన్​పరిధిలో మొత్తం 9 రేడియల్ రోడ్లను నిర్మించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఈ రోడ్లతో రాష్ట్ర, జాతీయ రహదారులను లింక్​ చేయనున్నారు. 

రోడ్ల నిర్మాణం ఇలా

గ్రీన్​ఫీల్డ్​రేడియల్​–2 రోడ్​ను 6 నెలల క్రితమే ప్రకటించారు. కొద్ది రోజుల కిందటే భూసేకరణకు నోటిఫికేషన్​జారీ చేశారు. శంషాబాద్​మండలంలోని కొత్వాల్​గూడ , శంషాబాద్​, రాయన్నగూడ, మల్కారం, రామాజీపూర్​, షాబాద్​ మండలంలోని సోలిపేట, హయతాబాద్​,పెద్దవేడ, దామర్లపల్లి, మాచన్​పల్లి, నాగర్ కుంట, బోంగిరిపల్లి, షాబాద్​, కొందుర్గ్​ మండలంలోని చుక్కంపేట, ముత్తూర్​, దామ్మెత్యాల్​, చౌదరిగూడెం మండలంలోని తుమ్మలపల్లె, వికారాబాద్​జిల్లా పరిగి మండలంలోని యాబాజీగూడ, రాపోలు , చిట్యాల మీదుగా రోడ్డును నిర్మించనున్నారు. ఈరోడ్లు పూర్తయితే ఓఆర్​ఆర్​ నుంచి త్రిపుల్​ ఆర్​ వరకూ సులభంగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంటుంది.