హాలీవుడ్ నటిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష

హాలీవుడ్ నటిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష
  • 2001లో నటి ఆష్లేను, 2005లో బ్రూనో అనే మహిళను దారుణంగా చంపిన మైఖేల్
  • 2008లో మిషెల్లే మర్ఫీ అనే మహిళపై హత్యాయత్నం చేసి దొరికిపోయిన నిందితుడు

హాలీవుడ్ నటి ఆష్లే ఎల్లరిన్ ను ఆమె ఫ్లాట్ లోనే దారుణంగా కత్తితో పొడిచి చంపిన కేసులో నిందితుడు మైఖేల్ గార్గిలోకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నటి ఆష్లేను హత్య చేసిన నిందితుడు మైఖేల్ గార్గిలో చిన్ననాటి నుంచే దుందుడుకు ప్రవర్తనతో క్రిమినల్ గా మారినట్లు కోర్టు నిర్దారించింది. నటిని హత్య చేసిన నాలుగేళ్ల తర్వాత 2005లో బ్రూనో అనే మహిళను కూడా ఇతడు దారుణంగా హత్య చేయడం నేర ప్రవృత్తికి నిదర్శనమని కోర్టు అభిప్రాయపడింది. హాలీవుడ్ నటి ఆష్లే తోపాటు పాటు మరో మహిళను హత్య చేసిన కేసుల్లో ఉన్న నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత అతని ప్రవృత్తి ఆధారంగా హాలీవుడ్ రిప్పర్ గా పేరుపొందాడు. 
2001లో నటి ఆష్లే తన సమ నటుడితో కాలసి డేట్ కు వెళ్లున్న సమయంలో మైఖేల్ ఆమె ఫ్లాట్ లోకి ప్రవేశించాడు. దాదాపు 47 కత్తిపోట్లు నటి శరీరంపై కనపడడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించినట్లు అర్థమవుతోంది. ఒంటరిగా ఉన్న నటి ఆష్లే.. సహ నటుడి రాకకోసం ఎదురు చూస్తున్న సమయంలో అగంతకుడు ప్రత్యక్షమై ఆమెపై దాడి చేసి దారుణంగా హతమార్చి వెళ్లిపోయాడు. ఈమె కోసం వచ్చిన సహ నటుడు కుచర్ తలుపు ఎంతకూ తీయకపోవడంతో కిటికీలో నుంచి తొంగి చూడగా ఫ్లోర్ పై రక్తం కనిపిస్తే వైన్ అనుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆమె శవాన్ని గుర్తించి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట కిటికీలో నుంచి చూసి మద్యం మత్తులో తాగి పడిపోయిందని భావించి వెళ్లిపోయిన సహనటుడు కుచర్ మొదటి సాక్షిగా కోర్టులో విచారణకు హాజరయ్యాడు. 
నిందితుడు మైఖేల్ నటిని చంపిన తర్వాతైనా మారిపోయి తన ప్రవృత్తిని వదులుకుని ఉంటే మరణశిక్ష తప్పిపోయేది కానీ.. మరో 4 ఏళ్ల తర్వాత బ్రూనో (32) అనే మహిళను కూడా చంపాడు. అటు తరవాత 2008లో మిషల్లే అనే మహిళపై దాడి చేసి హత్యాయత్నం చేయడంతో ఆమె తప్పించుకుంది. దాడి తర్వాత మైఖేల్ పారిపోయినప్పటికీ  ఘటనా స్థలంతో అతని రక్తపు చారలు పడడంతో పోలీసులు మైఖేల్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు విచారణలో తాను అమాయకుడినని మైఖేల్ చెప్పుకున్నా.. ఏళ్ల తరబడి నేర స్వభావంతో ప్రవర్తించడంతో కోర్టు అతని వాదనను తోసిపుచ్చింది. ఒకసారి చేస్తే పొరపాటు.. క్షణికావేశం అనుకోవచ్చని.. వరుసగా చేసిన ఘటనలను బట్టి ప్రవృత్తి అర్థమవుతుందంటూ లాస్ ఏంజెలెస్ కోర్టు మరణశిక్షను విధించింది.
మరణశిక్ష అమలు చేసే అవకాశం లేనట్లే
మైఖేల్ కు మరణశిక్ష విధించినా ఈ శిక్షను అమలుపరిచే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో  2019 నుంచి మరణశిక్షలపై నిషేధం ఉంది. 2006 తర్వాత ఇప్పటి వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక్క మరణశిక్ష కూడా అమలు కాలేదు. దీంతో మరికొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న మైఖేల్ కు ఇప్పట్లో మరణశిక్ష విధించే అవకాశం కనిపించడం లేదు.