చెత్త సమస్యకు మరో పరిష్కారం

చెత్త సమస్యకు మరో పరిష్కారం
  • ఇద్దరు జేసీలకు బాధ్యతలు
  • ఆరు జోన్లను చూసుకోనున్న జాయింట్​ కమిషనర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా ఎన్ని చర్యలు తీసుకున్న చెత్త సమస్య పరిష్కారం కావడం లేదు. కాలనీల నుంచి మొదలుకొని మెయిన్​రోడ్లపై కూడా చెత్త పేరుకుపోతోంది. చెత్త తరలించే బాధ్యత తీసుకున్న రాంకీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దీంతో కమిషనర్ కర్ణన్ శానిటేషన్ ను గాడిన పెట్టేందుకు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో శానిటేషన్, హెల్త్ పర్యవేక్షణ బాధ్యతలు ఒకే అడిషనల్​కమిషనర్ కు అప్పగించే వారు. 

అడిషనల్ కమిషనర్ కోఆర్డినేషన్ చేసుకోవడంలో విఫలమవుతుండడంతో ఆరు జోన్ల బాధ్యతలను ఇద్దరు జాయింట్ కమిషనర్లకు అప్పగించారు. ఎస్టేట్ విభాగానికి అడిషనల్​కమిషనర్ గా పని చేసిన అశోక్ సామ్రాట్ కు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్ జోన్లలో జరిగే శానిటేషన్ పనులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించగా, ఎలక్ట్రిసిటీ అడిషనల్ కమిషనర్ గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డికి ఎల్బీనగర్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్ల బాధ్యతలు అప్పగించారు.