
నలుగురు పిల్లలతో సహా పాకిస్థాన్ నుంచి భారత్‌కు పారిపోయిన సీమా హైదర్ తన ప్రేమికుడు సచిన్ మీనా ఇంట్లో నివసిస్తోంది. భారత ప్రభుత్వం నుండి పౌరసత్వం కోరుతూ మరణించే వరకు భారత్ లోనే ఉండాలని అనుకుంటున్నానని తన కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇంతలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
ఇందులో సచిన్ ఇప్పుడు తనను కొట్టడం ప్రారంభించాడని సీమా చెప్పడం చూడవచ్చు. సచిన్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని.. ఈ కారణంగా ఆమె పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలనుకుంటూ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఈ వీడియోలు పూర్తిగా నకిలీవి. వీటిని ఏఐ టెక్నాలాజీ ద్వారా క్రియేట్ చేశారు. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామంలో సచిన్ కుటుంబంతో కలిసి సీమా నివసిస్తోంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా (22)తో తరచూ ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడిన సీమా హైదర్.. అతనితో ప్రేమలో పడింది. తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది.