అక్రమార్కులకే ఫ్రీ ఇసుక .. ఉచితం పేరిట ఇష్టారాజ్యంగా ఇసుక తోలకాలు

అక్రమార్కులకే ఫ్రీ ఇసుక ..  ఉచితం పేరిట ఇష్టారాజ్యంగా ఇసుక తోలకాలు
  • పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్​మియావాగు నుంచి అక్రమ రవాణా 
  •  రోజూ 500 నుంచి 600 ట్రాక్టర్లతో తరలింపు 
  •  పట్టించుకోని అధికార యంత్రాంగం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఫ్రీ ఇసుక అక్రమారులకు కాసులు కురిపిస్తోంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటయ్యాక స్థానిక అవసరాల కోసం ఫ్రీ ఇసుక ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్‌‌‌‌‌‌‌‌మియా వాగుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. ప్రతిరోజూ 500 నుంచి 600 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుక తరలిస్తూ వాగులను లూటీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఫ్రీ పేరుతో శాండ్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఎగ్గొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
 
ఫ్రీ పేరిట ఇష్టారాజ్యంగా తరలింపు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్ ఏర్పాటయ్యాక ఇండ్లు కట్టుకునే స్థానికులకు ఇసుక భారం కాకూడదనే సదుద్దేశంతో ఫ్రీ ఇసుకకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దీనికనుగుణంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఇసుక అవసరాలను గుర్తించి గృహవసరాలకు ఇసును ఫ్రీగా తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. కానీ ఈ వెసులుబాటును అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్నారు. ఫ్రీ ఇసుక 10కిలోమీటర్ల పరిధిలోనే తరలించాల్సి ఉండగా.. జిల్లా వ్యాప్తంగా తరలిస్తున్నారు. 

సుల్తానాబాద్​, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్​ మండలాల పరిధిలోని మానేరు, హుస్సేన్​మియా వాగుల నుంచి ఇసుక విచ్చలవిడిగా తరలించుకుపోతున్నరు. ప్రతిరోజూ 500 నుంచి 600 వరకు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఫ్రీ ఇసుక కింద 10 కి.మీ పరిధిలో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిప్పునకు రూ.1200 తీసుకోవాలి. కానీ సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారిన అక్రమార్కులకు నిబంధనలకు విరుద్ధంగా రూ.3వేల నుంచి 5వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులకు ఇసుక భారంగా మారుతోంది. 

ఉచితమైనా దోపిడే 

గతంలో జిల్లాలో సక్సెస్‌‌‌‌‌‌‌‌గా కొనసాగిన శాండ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ పక్కకు పోయింది. ఫ్రీ పేరిట ఇటు శాండ్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఎగ్గొడుతూ, అటు వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. గతంలో క్వారీల మూలంగా నష్టం జరిగిందని, ఇప్పుడు కానీ ఫ్రీ ఇసుకతో అంతకుమించి దందా చేస్తున్నారని మానేరు పరివాహ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు విచ్చలవిడిగా ఇసుక తోలకాలతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని, బోర్లు ఎండిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాగులు ఎండిపోయాయంటున్నారు. 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం

ఫ్రీ ఇసుక గృహావసరాలకు మాత్రమే ప్రభుత్వం పర్మిషన్​ఇచ్చింది. కానీ అక్కడక్కడ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం ఉంది. నిబంధనలు అతిక్రమించిన వారిని గుర్తించి క్రిమినల్​ చర్యలు తీసుకుంటాం. అనుమతిచ్చిన ప్రదేశాల్లో, నిర్ణీత టైంలోనే ఇసుక తరలించాలి. ఏ వాగులో పడితే ఆ వాగులో ఇసుక తీస్తే చర్యలు తీసుకుంటాం.  

 శ్రీనివాస్​, ఏడీ మైనింగ్​, పెద్దపల్లి