అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

గోదావరిఖని, వెలుగు : ఓ యువకుడికి ఉద్యోగం పెట్టించేందుకు ఇచ్చిన డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉండడం, ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు ఇప్పించాలంటూ అసభ్యకరంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన గోదావరిఖనిలోని సీతానగర్‌‌‌‌లో బుధవారం వెలుగు చూసింది. సీతానగర్‌‌‌‌కు చెందిన చందా ప్రసాద్‌‌‌‌ (42) మేకల బిజినెస్‌‌‌‌ చేస్తుంటాడు. పుట్ట సతీశ్‌‌‌‌ అనే వ్యక్తికి సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని మేకల యుగంధర్‌‌‌‌ అనే వ్యక్తి 2014లో రూ. 3 లక్షలు తీసుకున్నాడు. 

ఈ డబ్బులకు మధ్యవర్తిగా చందా ప్రసాద్‌‌‌‌ ఉన్నాడు. అయితే యుగంధర్‌‌‌‌ పుట్ట సతీశ్‌‌‌‌కు ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. దీంతో సతీశ్‌‌‌‌ చాలాసార్లు ప్రసాద్‌‌‌‌ను డబ్బులు అడిగాడు. ఈ క్రమంలో ఈ నెల 22న రాత్రి సతీశ్‌‌‌‌ అతడి భార్య మౌనిక, తండ్రి కనకయ్య, తల్లి పూలమ్మ కలిసి ప్రసాద్‌‌‌‌ ఇంటికి వచ్చారు. తమ డబ్బులు ఇవ్వాలంటూ అసభ్యకరంగా తిట్టారు. మరో వైపు ప్రసాద్‌‌‌‌ వద్ద డబ్బులు తీసుకున్న గోదావరిఖనికి తతచెందిన మట్ట యుగంధర్‌‌‌‌రెడ్డి, జంగేటి రవికుమార్‌‌‌‌ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. 

దీంతో మరొకరి డబ్బుల విషయంలో మాటలు పడడం, తనకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రసాద్‌‌‌‌ మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన భార్య చుట్టుపక్కల వారి సాయంతో హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లింది. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. ప్రసాద్‌‌‌‌ భార్య శ్రీలత ఫిర్యాదుతో పుట్ట సతీశ్, మౌనిక, కనకయ్య, పూలమ్మ, మేకల యుగంధర్, మట్ట యుగంధర్‌‌‌‌రెడ్డి, జంగేటి రవికుమార్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌‌‌‌ చెప్పారు. 

మృతుడి కుటుంబానికి  వివేక్​ వెంకటస్వామి పరామర్శ 

గోదావరిఖని రాంనగర్‌‌‌‌లో ఆత్మహత్య చేసుకున్న చందా ప్రసాద్‌‌‌‌ ఫ్యామిలీని బుధవారం చెన్నూర్‌‌‌‌ ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి పరామర్శించారు. ముందుగా ప్రసాద్‌‌‌‌ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఫ్యామిలీమెంబర్స్‌‌‌‌ను పరామర్శించి, సంతాపం తెలిపారు.