ఆన్​లైన్​ టీచర్లకు మస్త్ డిమాండ్

ఆన్​లైన్​ టీచర్లకు మస్త్ డిమాండ్
  •   లాక్ డౌన్ తర్వాత పెరిగిన ఈ లెర్నింగ్ 
  •     టీచింగ్ వెబ్ సైట్లు జాబ్​మేళాలు కండక్ట్​ 
  •     ఎక్స్ పీరియన్స్, సబ్జెక్ట్ ని బట్టి శాలరీలు

కరోనా.. లాక్​డౌన్​కారణంగా స్కూళ్లు బంద్​అయి జాబ్​లు కోల్పోయిన టీచర్లకు డిమాండ్ పెరిగింది.  ఈ -లెర్నింగ్ సైట్లలో ఆన్​లైన్​ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువైంది. పేరెంట్స్ తమ పిల్లలకు వర్చువల్ క్లాసులను ఇప్పిస్తున్నారు. దీంతో బైజూస్, వేదాంతు, వైట్ హాట్ జూనియర్, ఎడ్యుటెక్ వంటి  ఈ -లెర్నింగ్ సంస్థలకు అడ్మిషన్లు పెరిగాయి. దాదాపు రెండింతలు స్టూడెంట్లు ఎక్కువయ్యారు. ఇందుకు అనుగుణంగా టీచింగ్ స్టాఫ్ ను కూడా పెంచేస్తున్నారు. కంపెనీలు టీచింగ్ వెబ్ సైట్లను కాంటాక్ట్ అయి టీచర్లను తీసుకుంటున్నాయి. వెబ్ సైట్లు వర్చువల్ గా జాబ్ మేళాలు కండక్ట్ చేసి  టీచర్లను సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తున్నాయి.  ఆ తర్వాత టీచర్లు ఆన్​లైన్​ట్యూటర్లుగా, డౌట్ సాల్వర్లుగా, కంటెంట్ క్రియేటర్లుగా పని చేస్తున్నారు. సిటీకి చెందిన టీచర్స్ వెబ్ సైట్స్ మూడు నెలల్లో దాదాపు 300 మంది టీచర్లకు ఈ ప్లాట్ ఫామ్ ల్లో అవకాశాలను కల్పించింది.

టీచర్లతో లైవ్ క్లాసులు కండక్ట్ 
రికార్డ్​ వీడియోల కంటే  ప్రత్యక్ష బోధన ద్వారానే స్టూడెంట్స్​కు ఎక్కువగా అర్థమవుతుంది. టీచర్ ప్రాక్టికల్​గా ఎక్స్ ప్లెయిన్ చేస్తుంటే పిల్లలు ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ తో వింటుంటారు. ప్రస్తుతం ఇదే పద్ధతిని ఈ- లెర్నింగ్ కంపెనీలు ఫాలో అవుతున్నాయి. క్లాస్ రూమ్ ఫీల్ ఉండేలా టీచర్లతో లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాయి. సబ్జెక్ట్ లో డౌట్స్​తీర్చడానికి సాల్వర్లను, లెస్సెన్స్ అర్థమయ్యేలా  ఆన్​లైన్​ ట్యూటర్లను నియమించుకుంటున్నాయి. ఏడాది క్రితం వరకు పిల్లలు నేరుగా స్కూల్​కి వెళ్లి ఫిజికల్ క్లాసులకు అటెండ్ అయ్యేవారు. టఫ్ సబ్జెక్ట్ ఉంటే ట్యూటర్​ని పెట్టించుకునేవారు. ఇప్పుడంతా వర్చువల్ అయిపోగా ఈ -లెర్నింగ్ కంపెనీలకు టీచర్ల కొరత ఏర్పడింది. దీంతో టీచర్లను రిక్రూట్ చేసుకునే పనిలో పడ్డాయి. అవసరాన్ని బట్టి, టీచర్ అనుభవాన్ని బట్టి గతంలో అతడు పొందిన శాలరీ కంటే మూడు రెట్లు ఎక్కువ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. చాలా ఆన్​లైన్​ఎడ్యుకేషన్ కంపెనీలు ప్రస్తుతం ఇదే చేస్తున్నాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్, ఈజీగా, సింప్లిఫై చేసి క్లాసులు చెప్పడం, ఎక్స్ పీరియన్స్​ని బట్టి టీచర్లను తీసుకుంటున్నాయి. లైవ్ క్లాసులు చెప్పే టీచర్లను లాంగ్​టర్మ్​లో తీసుకుంటున్నాయి.   ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు ఉంటాయి. వీరికి నెలకు జీతం రూ. 25వేల నుంచి మొదలవుతుంది. ట్యూటర్లు 3, 4 గంటలు లెస్సెన్స్ చెప్పడం ఉంటుంది. వీరికి గంటకు ఐదొందల నుంచి 800 జీతం ఉంటుంది. అలాగే డౌట్ సాల్వర్స్ కి, కంటెంట్ క్రియేచర్లకు ఫుల్ డే వర్క్, మంత్లీ పేమెంట్ ఇస్తున్నాయి.

వర్చువల్ జాబ్​మేళాల ద్వారా..
ఈ -లెర్నింగ్​టీచర్ల కోసం వెబ్ సైట్లు వర్చువల్ జాబ్ మేళాలను కండక్ట్ చేస్తున్నాయి. బయోడేటా, ఎక్స్ పీరియన్స్, స్కిల్స్ పై సీనియర్ టీచర్లతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. సెలెక్ట్ అయిన టీచర్లకు కంపెనీ రిక్వైర్​మెంట్​కు అనుగుణంగా టీచింగ్, స్కిల్ డెవలపింగ్​లో ట్రైనింగ్ ఇస్తున్నాయి. జాబ్ మేళాలకు టీచర్ల నుంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్​గా ఓ వెబ్​సైట్ నిర్వహించిన జాబ్​మేళాలో 62.86 శాతం మంది మహిళా, 37.14 శాతం మంది మేల్ టీచర్లు హాజరయ్యారు. వీరిలో ఫ్రెషర్స్ నుంచి తొమ్మిదేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న 200 మంది, పదేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు 400 మంది వరకు ఉన్నారు. బీఈడీ చదివిన వారు 87%, ఎంఈడీ చదివినవారు 59% ఉన్నారు. వీరికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి సెషన్స్ వైజ్​గా ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలకు రిఫర్ చేస్తున్నాయి. ఇలా టీచింగ్ వెబ్ సైట్ల ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8500 మంది టీచర్లకు వెబ్​సైట్ల నిర్వాహకులు ట్రైనింగ్​ ఇచ్చారు.