రేపు భారత్, బంగ్లా మధ్య సెకండ్ వన్డే

రేపు భారత్, బంగ్లా మధ్య సెకండ్ వన్డే

భారత్, బంగ్లాదేశ్ మధ్య రేపు రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే ఫస్ట్ వన్డేలో ఓడిపోయిన టీమిండియా... సెకండ్ వన్డేలో గెలిచి సిరీస్ రేసులో ఉండాలని చూస్తోంది. అటు ఫస్ట్ వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీతో మంచి ఊపు మీద ఉన్న బంగ్లా పులులు.. రేపటి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. టీమిండియా బౌలింగ్ లో రాణించినప్పటికీ... బ్యాటింగ్ పరంగా మాత్రం దారుణంగా విఫలమైంది. ఫీల్డింగ్ లోనూ భారత ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 



పసి కూన బంగ్లాపై ఈజీగా గెలిచే మ్యాచ్ ను చేజేతులా జారవిడుచుకుంది టీమిండియా. ఒక్క KL రాహుల్ తప్పా.. మిగతావారంతా వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెరగనుంది. రేపటి మ్యాచ్ లో రోహిత్ గ్యాంగ్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేల్లో మోకాలి నొప్పితో బాధపడిన శార్ధూల్  ఠాకూర్ కు విశ్రాంతి ఇవ్వనున్నారు. అతని ప్లేస్ లో యువ పేసర్  ఉమ్రాన్  మాలిక్  తుది జట్టులోకి తీసుకోనున్నారు. ఆల్ రౌండర్  షబాజ్  ఆహ్మద్  స్థానంలో రాహుల్  త్రిపాఠి జట్టులోకి తీసుకోవాలని మేనేజేమెంట్  ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ తో త్రిపాఠి వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్ట్  టైమ్  బౌలర్ గా కూడా రాణించే సత్తా త్రిపాఠికి ఉంది.

మరోవైపు ఫస్ట్ మ్యాచ్ లో ఒక్కరు ఇద్దరు ప్లేయర్లు తప్పా బంగ్లా టీమ్ లోనూ సేమ్ సిచ్చువేషన్ కనిపిస్తోంది. చివర్లో మోహిది హసన్, ముస్తాఫిజుర్ పోరాడి ఫస్ట్ వన్డేలో చార్రిత్రక విజయాన్ని అందించారు. సంచలనాలకు కేరాఫ్ అయినా బంగ్లా పులులను తక్కువ అంచనా వేయలేం... ఎప్పుడు ఎవరు రాణిస్తారో కూడా తెలియదు. అటు ఫస్ట్ వన్డేలో బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ 5 వికెట్లు తీయగా... ఎబాదల్ హోస్సేన్ 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో బౌలింగ్ లో ఆ టీమ్ ఎప్పుడు ఫామ్ లోనే ఉంటుంది. బ్యాంటింగ్ పై కాస్త దృష్టి పెడితే... టీమిండియాకు షాక్ ఇచ్చే అవకాశం లేకపోలేదని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.  మూడు వన్డేల సిరీస్ లో భాగంగా... సెకండ్ వన్డేలో గెలిచి సొంతగడ్డపై సిరీస్ గెలవాలని చూస్తోంది బంగ్లాదేశ్. టీమిండియా మాత్రం ఒత్తిడి నుంచి బయటపడి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది.