తవాంగ్ ఘర్షణలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తవాంగ్ ఘర్షణలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ : లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. క్వశ్చన్ అవర్ జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. తవాంగ్ ఘర్షణపై రాజ్ నాథ్ సింగ్ ప్రకటన 12 గంటలకు ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పినా వినిపించుకోకపోవడం సరికాదన్నారు. 

తవాంగ్ ఘర్షణలపై ఉభయ సభల్లో దుమారం చెలరేగడాన్ని అమిత్ షా ప్రస్తావిస్తూ..1962లోనే చైనా చాలా భూభాగం ఆక్రమించిందన్నారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ ఉన్నంత కాలం చైనాకు ఒక్క ఇంచు భూమిని కూడా వదులుకోం అని అమిత్ షా స్పష్టం చేశారు. సోనియా ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు చైనా నుంచి నిధులు వచ్చాయని అమిత్ షా ఆరోపణలు చేశారు.