
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 100 విమానాలను అధికారులు రద్దు చేశారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి 52 డొమెస్టిక్ డిపార్చర్స్, 44 అరైవల్స్, ఒక ఇంటర్నేషనల్ సర్వీసును రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని సర్వీసులే నడుస్తున్నాయని, భద్రతా చర్యల కారణంగా వీటి సర్వీసుల్లోనూ మార్పులు ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, దేశంలోని నార్త్, వెస్ట్ ప్రాంతాల్లో 32 ఎయిర్‌పోర్టులను మూసివేశారు.