మెర్కోర్ (Mercur) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రిక్రూటింగ్ స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురు 22 ఏళ్ల స్నేహితులు ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే సొంతంగా ఎదిగిన బిలియనీర్లుగా నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు 23 ఏళ్ల వయసులో (2008లో) బిలియనీర్ అయిన మార్క్ జుకర్‌బర్గ్ పేరిట ఉండేది.
ఈ మెర్కోర్ స్టార్టప్‌ను హైస్కూల్ స్నేహితులైన ముగ్గురు యువకులు బ్రెండన్ ఫుడీ(ceo), ఆదర్శ్ హిరేమత్(CTO), సూర్య మిధా (బోర్డు చైర్మన్) కలిసి స్థాపించారు.
ఫోర్బ్స్ ప్రకారం శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ కంపెనీ ఇటీవల 35 కోట్ల నిధులను సేకరించింది. దీంతో కంపెనీ మొత్తం విలువ ఏకంగా వెయ్యి కోట్లకు చేరుకుంది. చివరికి ఈ ముగ్గురు వ్యవస్థాపకులు అతి పిన్న వయసులో బిలియనీర్లుగా ఎదిగి గుర్తింపు పొందారు. ఈ ముగ్గురు వ్యవస్థాపకులలో ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా ఇద్దరూ భారతీయ-అమెరికన్లు కావడం విశేషం.
ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఉన్న బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ అనే స్కూల్లో కలిసి చదువుకున్నారు. సూర్య మిధా తల్లిదండ్రులు న్యూఢిల్లీ నుండి అమెరికాకు వలస వెళ్లగా... సూర్య మిధా అమెరికాలోనే పుట్టి పెరిగారు.
ఆదర్శ్ హిరేమత్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతు.. మెర్కోర్ కోసం రెండేళ్లకే చదువు ఆపేశాడు. నా జీవితం ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని హిరేమత్ తెలిపారు. ఆదర్శ్ హిరేమత్ హార్వర్డ్ నుండి, బ్రెండన్ ఫుడీ, సూర్య మిధా ఇద్దరూ కూడా జార్జ్‌టౌన్ యూనివర్సిటీ డ్రాప్ ఔట్స్.
ఈ ఘనత సాధించిన ఇతరులు:
మెర్కోర్ వ్యవస్థాపకుల కంటే ముందు పాలీమార్కెట్ CEO షేన్ కోప్లాన్ (27) ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ నుండి 200 కోట్ల పెట్టుబడి తర్వాత బిలియనీర్ అయ్యారు. స్కేల్ AI సహ వ్యవస్థాపకుడైన అలెగ్జాండర్ వాంగ్ (28) దాదాపు 18 నెలలు ఈ బిరుదుతో కొనసాగారు. అలెగ్జాండర్ వాంగ్ సహ వ్యవస్థాపకురాలు లూసీ గువో 30 సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులోనే ఎదిగిన మహిళా బిలియనీర్ అయ్యారు. వీరంతా ఈ మధ్య కాలంలో బిలియనీర్లు అయిన యువ టెక్ వ్యవస్థాపకులు.
