
భారత ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న CERT-In (ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం), ఆపిల్ ఉత్పత్తులు వాడే వారికీ ఒక కొత్త వార్నింగ్ జారీ చేసింది. ఈ వార్నింగ్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీ, విజన్ ప్రో వంటివి వాడే ఎంతో మంది ప్రజలపై ప్రభావం చూపొచ్చు. ఎందుకంటే మీరు ఇంకా మీ ఫోన్ లేదా డివైజ్ సాఫ్ట్‌వేర్ అప్ డేట్ చేయకపోతే సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉంది.
CERT-In ప్రకారం iPhone - 18.6కి ముందు ఉన్న iOS వెర్షన్లు, iPad - iPadOS 17.7.9 లేదా 18.6 కి ముందు ఉన్న వెర్షన్లు, Mac - macOS Sequoia 15.6, Sonoma 14.7.7 లేదా Ventura 13.7.7 వెర్షన్ల కంటే పాత వెర్షన్లు, Apple Watch - watchOS 11.6కి ముందు ఉన్న వెర్షన్లు, Apple TV / Vision Pro - tvOS లేదా 18.6 / 2.6కి ముందు ఉన్న visionOS వెర్షన్లు వంటి పాత వెర్షన్ ఇంకా రన్ చేస్తుంటే మీరు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరికరాల్లో బఫర్ ఓవర్‌ఫ్లో, యూజ్-ఆఫ్టర్-ఫ్రీ బగ్స్, లాజిక్ ఎర్రర్స్, ఇన్‌పుట్ వాలిడేషన్ వంటి టెక్నికల్ లోపాలు బయటపడ్డాయి అని CERT-In చెప్పింది. దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేయవచ్చు.
అంటే మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం, మీ డివైజ్ కంట్రోల్ చేయడం లేదా సిస్టమ్‌ను క్రాష్ చేయడం (DoS దాడి), సెక్యూరిటీ ప్రొటేషన్ దాటేయడం జరగవచ్చు. ఈ సైబర్ దాడులు కేవలం ఏదైనా ఫైల్ లేదా లింక్ రూపంలో ఉంటాయి. CERT-In ఆపిల్ వాడే వారు లేదా కార్పొరేట్ ఉద్యోగులు అయినా వెంటనే వారి డివైజెస్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ కావాలని సిఫార్సు చేస్తుంది. ఈ అప్ డేట్ ఆపిల్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా లేదా మీ డివైజ్ సెట్టింగ్‌లలో మార్చవచ్చు.
సేఫ్ గా ఉండటానికి ఏం చేయాలి: సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ఎప్పుడూ స్కిప్ చేయవచ్చు. తెలియని ఇమెయిల్‌లు, లింక్‌లు, ఫైల్‌లను ఓపెన్ చేయవచ్చు. రెండు-కారకాల భద్రత (2factors athentication ) వాడండి. అలాగే మీ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చండి