సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు.. నిందితుడిపై లుకౌట్ నోటీసు జారీ

సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు.. నిందితుడిపై లుకౌట్ నోటీసు జారీ

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ మార్చిలో గోల్డీ బ్రార్ పేరిట బెదిరింపుల మెయిల్ పంపించిన యునైటెడ్ కింగ్‌డమ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థికి ముంబై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విద్యార్థి హర్యానాకు చెందినవాడని విచారణలో తేలింది. అతను ప్రస్తుతం మెడికల్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నాడని.. బ్రిటన్‌లో విద్యార్ధి సెషన్ ముగిసే సమయానికి ఈ ఏడాది చివరి నాటికి భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేరుతో మార్చిలో విద్యార్థి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కొంత కాలంగా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ముంబై పోలీసులు వై ప్లస్ భద్రతను కూడా కల్పించారు. ఒక టీవీ షోలో, సల్మాన్ తనకు ప్రాణహాని ఉన్నందున ముంబై పోలీసుల నుంచి తనకు లభించిన Y+ కేటగిరీ భద్రత గురించి సల్మాన్‌ మాట్లాడుతూ.. అభద్రతాభావం కంటే భద్రతే మేలు అన్నారు. “ఇప్పుడు రోడ్డుపై సైకిల్ తొక్కుతూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్లడం సాధ్యం కాదు. దాన్ని అధిగమించడానికి అవకాశంలేదు. నన్ను చూడాలనుకునేవారికి అసౌకర్యం కలగవచ్చు అని చెప్పారు.