సస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్‌ఏఎఫ్) తో నడిచే విమానం ఒకటి ఇండిగో గూటికి చేరింది. సాధారణ ఫ్యూయల్+ సస్టయిన్‌బుల్ ఫ్యూయల్‌తో నడిచే ఏ320 నియో విమానాన్ని ఎయిర్‌బస్ శుక్రవారం ఇండిగోకి డెలివరి చేసింది. ఈ ఫ్యూయల్‌లో 90 శాతం సాధారణ ఏవియేషన్ ఫ్యూయల్, 10 శాతం సస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉంటుంది. ఆల్గే, బయోమాస్ వంటి ప్రొడక్ట్‌ల నుంచి ఈ సస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్‌ను తీస్తారు.
