రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

 రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చేర్యాల, వెలుగు: రాజకీయాలకతీతంగా చేర్యాల మున్సిపాలిటీని డెవలల్​ చేయాలని ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. సోమవారం మున్సిపల్​ ఆఫీస్​లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డితో కలిసి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్లతో అవసరం ఉన్నచోట ఖర్చుచేయాలని, రూ.6 కోట్లతో సైడ్​ డ్రైన్​లు, సీసీ రోడ్లు, మున్సిపల్​ బిల్డింగ్​కు రూ.1.50 కోట్లు కేటాయించి కాంప్లెక్స్​ను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. 

అనంతరం పెద్ద చెరువు కట్టను పరిశీలించి, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎలా పనులు కొనసాగిస్తున్నారని ఫైర్​ అయ్యారు. చెరువు కట్ట సుందరీకరణ కోసం రూ.3.14 కోట్ల ఫండ్స్​ వస్తే భూమిపూజ చేయకుండా పనులు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. గిరి కొండల్​ రెడ్డి, కొమ్ము నర్సింగరావు, కొమ్ము రవి, భాస్కర్​ రెడ్డి, నరేందర్, లీలా సంజీవులు పాల్గొన్నారు.