V6 News

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్.. నెలకు 1 లక్షకి పైగా సంపాదన.. కానీ ఆమె మనిషి కాదు!

 ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్.. నెలకు 1 లక్షకి పైగా సంపాదన.. కానీ ఆమె మనిషి కాదు!

సోషల్ మీడియాలో వృతికా పటేల్ అనే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చాలా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్ష మందికి పైగా ఫాలోవర్లు కూడా  ఉన్నారు. ఆమె ప్రొఫైల్ చూస్తే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక ఫోటోలో నీలి రంగు కుర్తాలో కనిపిస్తే, మరో ఫోటోలో టీ తాగుతూ, ఇంకో ఫొటోలో  బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు.

చూడటానికి ఆమె ఇతర ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల లాగే అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏమిటంటే వృతికా పటేల్ ఒక నిజమైన మనిషి  కాదు. ఆమె ఒక AI ఇన్‌ఫ్లుయెన్సర్. అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేసిన ఒక డిజిటల్ రూపం. 2010 నుంచే ఇలాంటివి ఉన్నా, ఇప్పుడు వస్తున్న కొత్త AI టెక్నాలజీ వల్ల ఇవి అచ్చం మనుషుల్లాగే కనిపిస్తున్నాయి.

AI ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏమిటి?
సాధారణంగా చెప్పాలంటే, వీరు మనుషుల ద్వారా సృష్టించబడిన డిజిటల్ క్యారెక్టర్లు. వీరు మనుషుల్లాగే ప్రవర్తిస్తారు, బట్టలు ధరిస్తారు,  ఫోటోలకు ఫోజులిస్తారు. కానీ ఫోటోలను బాగా పరిశీలించి గమనిస్తే తప్ప.. మరీ నున్నగా ఉండే చర్మం, పర్ఫెక్ట్ లైటింగ్ వంటి చిన్న చిన్న తేడాలు తప్ప, వీరు నిజమైన మనుషులు కాదని గుర్తు పట్టడం కష్టం.

వృతికా పటేల్ సంపాదన ఎంత?
ఈ AI మోడల్‌ను తయారు చేసిన వారు దీని ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. వృతికా పటేల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 300 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రతి సబ్‌స్క్రైబర్ నెలకు రూ.399 చెల్లిస్తారు. అంటే కేవలం సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే నెలకు రూ.1,19,700 సంపాదిస్తున్నారు. ఇది కాకుండా బ్రాండ్ యాడ్స్, ప్రమోషన్ల ద్వారా వచ్చే ఆదాయం అదనం.

ALSO READ : ఐటీ ఉద్యోగులకు రక్త కన్నీరు

విమర్శలు, చర్చ
ఈ విషయం సోషల్ మీడియాలో బయటకు రావడంతో పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై ప్రజలు రకరకాలుగా  స్పందిస్తున్నారు. సమాజంపై ప్రభావంతో కొందరు వ్యక్తులు మన సంస్కృతిని, విలువలను నాశనం చేయడానికి AIని వాడుతున్నారని, దీనికి కారణం మనుషులేనని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి అకౌంట్ల ద్వారా కొందరు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి, ఒక మనిషి లేకుండానే కేవలం టెక్నాలజీతో నెలకు లక్షలు సంపాదించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.