
ఆపిల్ ఐఫోన్ వాడని వారు ఈ రోజుల్లో చాల తక్కువ. ఎందుకంటే దీనికి ఉన్న క్రేజ్ అలాంటిది. డబ్బులు లేకపోయినా EMIలో తీసుకునేందుకు కూడా వెనకడుగు వెయ్యరు. ప్రతి ఏడాది ఆపిల్ కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ వస్తుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది.
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 9న 'Awe Dropping' ఈవెంట్‌లో లాంచ్ కానుంది. కుపెర్టినోకు చెందిన ఈ టెక్ కంపెనీ ఈ ఏడాది అతిపెద్ద హార్డ్‌వేర్ లాంచ్‌లో కొన్ని ఇతర ఆక్సెసోరిస్ తో పాటు నాలుగు కొత్త ఐఫోన్‌లను తీసుకొస్తుంది. అయితే లాంచ్ కు ముందే ఐఫోన్ 17 సిరీస్ ధర గురించి చాలా పుకార్లు, అంచనాలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం చూస్తే.....
ఐఫోన్ 17 డిజైన్ ఇంతముందులాగే అలాగే ఉంటుందని, ఫోన్‌కు కొత్త A19 ప్రాసెసర్, 120Hz LTPO డిస్ ప్లే పరంగా ప్రైమరీ అప్‌గ్రేడ్స్ సహా ఈ నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లలో కొత్త 24MP సెల్ఫీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 17 ప్రో అలాగే ఐఫోన్ 17 ప్రో మాక్స్ కి ఒకే వరుసలో కెమెరాలు, అల్యూమినియం అండ్ గ్లాస్ బాడీతో వచ్చే అవకాశం ఉంది, అయితే గతంలో క్లాసిక్ టైటానియం ఫ్రేమ్ ఉండేది.
TSMC కొత్త 3nm ప్రాసెస్ టెక్నాలజీ ఆధారంగా ఆపిల్ కొత్త A19 ప్రో సిలికాన్‌పై పనిచేస్తుంది. గత ఏడాది ఐఫోన్ 16 మోడళ్లలో ఇచ్చిన 8GB ర్యామ్ కాకుండా ఈసారి ప్రో వేరియంట్‌లో 12GB RAMని ఇవ్వొచ్చు. కెమెరా లెన్స్ 48MPకి అప్‌గ్రేడ్ చేయావచ్చని భావిస్తున్నారు. ఇదే నిజమైతే ఐఫోన్ 17 ప్రో మోడళ్లలో మూడు 48MP కెమెరాలు ఉంటాయి.
ఐఫోన్ 17 ధర: ఐఫోన్ 17 ధరపై ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే అమెరికా ప్రభుత్వం సుంకాలు విధించిన తర్వాత విడి భాగాల ధర పెంపుతో $50 (రూ.4,409) పెరిగే అవకాశం ఉందని లీకైన సమాచారం, ఇతర మోడల్స్ ధర అదే $799(రూ.70,464) ఉండొచ్చని అనుకుంటున్నారు. ధరల పెరుగుదల లేకపోతే ఐఫోన్ 17 ఇండియాలో రూ.79,990 ఉండొచ్చు.
ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ధర: చాలా అంచనాలు, పుకార్లు, వార్తల ప్రకారం ప్రో ఐఫోన్ వేరియంట్ ధర కూడా $50 (రూ.4,409) పెరగొచ్చని చెబుతున్నారు, ఇదే నిజమైతే ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర $1,049(రూ.92,513) నుండి $1,249(రూ.1,10,152) పైగా ఉండొచ్చు. భారతదేశంలో ఈ రెండు మోడళ్ల ధర రూ.1,24,990 అలాగే రూ.1,49,990 ఉండొచ్చని అంచనా.