
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి. నారాయణన్ భవిష్యత్తులో చేయబోయే అంతరిక్ష కార్యక్రమాల గురించి కీలక ప్రకటనలు చేశారు. 2040లోగా భారత్ చంద్రుడిపై మనిషిని దించి, సురక్షితంగా తిరిగి తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకుందని ఆయన తెలిపారు. అలాగే 2035లోగ భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS) పేరుతో ఒక స్పెస్ సెంటరుని స్థాపించనున్నట్టు చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ విషయాలు వెల్లడించడం విశేషం.
అయితే ఇస్రో ఛైర్మన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో మేము చంద్రయాన్-4 మిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్లను చేపట్టనున్నాము. నెక్స్ట్ జనరేషన్ లాంచర్ (NGL)కు ప్రధాని ఆమోదం తెలిపారు. 2035 నాటికి BAS అనే స్పెస్ సెంటరు ఏర్పాటు చేస్తాము. 2040 నాటికి భారత అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలో మరే ఇతర అంతరిక్ష కార్యక్రమానికి తగ్గని విధంగా ఉంటుంది అని అన్నారు.
గగన్‌యాత్రిపై ఇస్రో ఛైర్మన్: కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన శుభాన్షు శుక్లా విజయాన్ని గురించి కూడా మాట్లాడారు. మన స్వంత రాకెట్‌లో గగన్‌యాత్రిని పంపే ముందు వారిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని అన్నారు. ప్రధాని మోదీ శుభాన్షు శుక్లాను అభినందిస్తూ ఆక్సియమ్-4 మిషన్ విజయాన్ని ప్రశంసించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత జెండా ఎగరేసి ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారని అన్నారు.
ALSO READ : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్..
అయితే శుభాన్షు శుక్లా నాసా యాక్సియమ్-4 (AX-4) అంతరిక్ష యాత్రను పూర్తి చేసి జూలై 15న భూమికి తిరిగి వచ్చిన సంగతి మీకు తెలిసిందే. 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు కూడా ఈయనే. భారతదేశ మొట్టమొదటి హ్యూమన్ స్పెస్ మిషన్ అయిన గగన్‌యాన్ 2027లో జరగనుంది. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, శుభాన్షు శుక్లా గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైయ్యారు.