ఐటీ సోదాలు.. పైసలు లెక్కబెట్టేందుకు 13 గంటలు

ఐటీ సోదాలు.. పైసలు లెక్కబెట్టేందుకు 13 గంటలు

మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు దిమ్మదిరిగే ఆస్తులు గుర్తించారు. రూ.56 కోట్ల నగదుతో పాటు 32 కిలోల బంగారం, రూ.16 కోట్ల విలువైన వజ్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు పలు స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ రూ.390 కోట్ల ఉంటుందని అంచనా వేశారు.

మహారాష్ట్ర జల్నాలోని స్టీల్, గార్మెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యాపారి ఇళ్లు ఆఫీసులపై ఆగస్టు 1 నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఐదు టీంలుగా ఏర్పడి 8వ తేదీ వరకు సోదాలు కొనసాగించింది. వ్యాపారి నివాసంలో సొమ్ము అంతగా దొరకకపోవడంతో ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహించగా కప్ బోర్డులు, బెడ్ల కింద బ్యాగుల్లో నగదు లభ్యమైంది. అధికారులు సీజ్ చేసిన నగదును కౌంటింగ్ మెషీన్లతో లెక్కించడానికి దాదాపు 13 గంటల సమయం పట్టింది.