
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందులో మెంబర్: జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబం.. ఇప్పుడు కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దోచుకోవడంలో కేసీఆర్ కుటుంబాన్ని మించిన వారు మరెవరూ లేరని అన్నారు. కాళేశ్వరం దోపిడీ నుంచి మొదలుకుంటే ఇసుక, లిక్కర్ దందా మీ కుటుంబానిదేనని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి కమాన్ నుంచి మాదాపూర్ వరకు ఉన్న పబ్బులు, లిక్కర్ దందా కేటీఆర్, సంతోష్లదేనని ఆరోపించారు.
భూములను లాక్కుంది, చెరువులను మింగింది కేసీఆర్ కుటుంబమేనని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి ప్రొఫెసర్లు అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా అని, అందులో సభ్యుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అని విమర్శించారు. ‘‘నీలాగా బీ ఫామ్ కొనుక్కునే లీడర్‌ను కాదు నేను, ప్యాకేజీ లీడర్వు నువ్వు... పబ్లిక్ లీడర్‌ను నేను” అని అన్నారు.