
జనగామ, వెలుగు: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనగామ ఎమ్మల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. సోమవారం తన క్యాంప్ఆఫీస్ లో జనగామ టౌన్, రూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.2.46 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక లోటు ఉందని పదే పదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయోజనం లేని అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.