బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాను బాధాకర సమయంలో అప్పుడప్పుడు మద్యం సేవించానని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే నేషనల్ మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకుని “ జాన్వీకి మద్యం అలవాటు” ఉందని ప్రచారం చేశాయి. ఈ విషయంపై ఆఫ్ ది రాక్స్ & అమాహా అనే మద్యపాన వ్యసన విముక్తి సంస్థ ఆదివారం (మే 3) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది.
మద్యపాన వ్యసన విముక్తి సంస్థ క్లారిటీ..
జాన్వీ తన జీవితంలో ఒక కఠిన సమయంలో అప్పుడప్పుడు మద్యం సేవించానని చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసింది. దీనిపై సంస్థ స్పందిస్తూ, “జాన్వీ కపూర్ ఈ అంశంలో ఒక కేర్‌గివర్, మద్దతుదారు మాత్రమే. ఆమెకు మద్యం వ్యసనం లేదా అలవాటు లేదు” అని తెలిపింది. అలాగే, జాన్వీ ఒక సంరక్షకురాలిగా, సామాజిక బాధ్యత గల వ్యక్తిగా మాత్రమే ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయ్యారని ఆ సంస్థ పేర్కొంది. అంతేకానీ, తనకు ఎలాంటి వ్యసనాలు లేవని తెలుపుతూ నోట్ ద్వారా వివరించింది.
అలాగే, ఇలాంటి తప్పుడు ప్రచారం వ్యసనంతో పోరాడుతున్న వారి అనుభవాలను అవమానించేలా ఉంటుందని పేర్కొంది. క్లిక్‌బైట్ కోసం వాస్తవాలను వక్రీకరించవద్దని మీడియాను హెచ్చరించింది.
ఈ క్రమంలోనే జాన్వీ మాట్లాడిన వ్యాఖ్యలను క్లిక్ బైట్ కోసం తప్పుగా ఉపయోగించుకోవద్దని హెచ్చరించింది. తప్పుడు కథనాలు వ్యసన బాధితులను అవమానిస్తాయని పేర్కొంటూ, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సంస్థ కోరింది. జాన్వీ కూడా తన ఇన్‌స్టా ద్వారా అసలు విషయాన్ని తెలియజేస్తూ, తాను కేవలం ఒక సందర్భంలో మాత్రమే తన భావాలను మాత్రమే పంచుకున్నానని వివరించారు.
జాన్వీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, జీవితంలోని బాధాకర సమయంలో మాత్రమే అరుదుగా మద్యం సేవించానని వెల్లడించారు. అయితే తాను ఎప్పుడూ దానికి బానిస కాలేదని స్పష్టం చేసింది. పొద్దున్న లేస్తే వచ్చే హ్యాంగోవర్, ఆపై వాసన నచ్చక వెంటనే ఆ అలవాటు మానేసినట్లు చెప్పింది. కానీ ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు, “ఆల్కహాల్ లేకుండా నిద్రపట్టదు” అంటూ తప్పుడు ప్రచారం చేయడం వివాదాస్పదంగా మారింది.
